Tuesday, March 3, 2026
Homeరంగారెడ్డిDefection | కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ సుమలతా జైపాల్ రెడ్డి

Defection | కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ సుమలతా జైపాల్ రెడ్డి

  • కండువాగప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కాలె యాదయ్య

గత పదేండ్లుగా తెలంగాణ అభివృద్ధి అంటూనే ఆర్థికంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని కాస్తా అప్పుల పాలు జేసిన బిఆర్ఎస్ పార్టీని వీడి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె  యాదయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందని పెద్ద మంగళారం మాజీ ఎంపీటీసీ సుమలతా జైపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తన అనుచర వర్గంతో వచ్చిన జైపాల్ రెడ్డికి చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలోకి సాధర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువాగప్పి ఆహ్వనించారు. ఆయనతోపాటు సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి ఉన్నారు.

ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు షాబాద్ దర్శన్, మొయినాబాద్ పిఎసిఎస్ చైర్మన్ మందాడి చంద్రారెడ్డి, పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ చేగురి రామకృష్ణ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాయమాటలు జెప్పి తెలంగాణను గత ప్రభుత్వం అప్పులపాలు జేసిందని, సుస్థిర అభివృద్ధికై పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నాని జైపాల్ రెడ్డి అన్నారు.

- Advertisement -

కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబన్న, బండారి చంద్రారెడ్డి, మందాడి రాఘవరెడ్డి, హిమాయత్ నగర్ మాజీ సర్పంచ్ పల్లగొల్ల మల్లేష్ యాదవ్, సురంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వెంకట్ రెడ్డి, పల్లగొల్ల అశోక్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పట్నం రామ్ రెడ్డి, రేణుక రాజు గౌడ్, బేగరి రాజు, కొత్తపల్లి విక్రంరెడ్డి, కమ్మరి యాదగిరి చారి, ఏం సురేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News