Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిCampaign | బాటసింగారం - కొత్తగూడం ఎన్నికల ప్రచారం..

Campaign | బాటసింగారం – కొత్తగూడం ఎన్నికల ప్రచారం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బాటసింగారం, కొత్తగూడం గ్రామాల్లో బాటసింగారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎర్రవల్లి గౌరీ శంకరాచారికి మద్దతుగా రైతుబంధు జిల్లా మాజీ చైర్మన్, తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డి ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ చేసిన అభివృద్ధికి వివరిస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి ఎర్రవల్లి గౌరీ శంకరాచారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోముల జగదీష్, మాజీ ఎంపీపీ బబ్బూరు మంజూల దేవేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News