Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌SIT | కేసీఆర్ సిట్ విచారణకు మద్దతుగా బీఆర్‌ఎస్ శ్రేణుల పిలుపు

SIT | కేసీఆర్ సిట్ విచారణకు మద్దతుగా బీఆర్‌ఎస్ శ్రేణుల పిలుపు

  • నేడు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని శ్రేణులకు ఎమ్మెల్యే పద్మారావు పిలుపు
  • సిట్ విచారణ కై వెళుతున్న కేసీఆర్‌కు అండగా నిలవాలి

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆదివారం హైదరాబాద్‌లో హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని మాజీ డిప్యుటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ శ్రేణులకు అభిమానులకు నేతలకు పిలుపునిచ్చారు.

సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు,అడ్డగుట్ట,మెట్టుగూడ,తార్నాక,సీతాఫలమండీ,బౌద్ధనగర్ మున్సిపల్ డివిజన్ల బీఆర్‌ఎస్ నాయకులు,మహిళా నేతలు,ఉద్యమకారులు,వివిధ పోలింగ్ బూత్ కమిటీల ప్రతినిధులు ఉదయం 10:30 గంటల లోపు తెలంగాణ భవన్,హైదరాబాద్‌కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఈ సందర్భంగా తీగుళ్ళ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై కక్షపూరితంగా కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

- Advertisement -

ఇలాంటి సమయంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా నిలబడి మన నాయకుడికి మద్దతు తెలపాల్సిన బాధ్యత మనపై ఉంది అని అన్నారు.తెలంగాణ భవన్ వద్ద శాంతియుతంగా సంఘీభావం తెలియజేస్తూ, పార్టీ క్రమశిక్షణను పాటించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటాలని పద్మారావు గౌడ్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News