Saturday, March 21, 2026
Homeనల్లగొండAlair | 420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

Alair | 420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు అని ఆలేరు నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎండి ఫక్రుద్దీన్, పేర్కొన్నారు. మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికలు పురస్కరించుకొని శనివారం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మూడోవాడు కౌన్సిలర్ అభ్యర్థి యాట శివ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మార్చేందుకు బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేద బలహీన వర్గాల కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింద న్నారు. జరిగిన గత ఎన్నికలలో 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మరోసారి వారి ఉచిత వాగ్దానాలను నమ్మొద్దు అని పిలుపు నిచ్చారు.

- Advertisement -

తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆలేరు అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ కృష్ణ గౌడ్,,బేతి రాములు, యాట లావణ్య, ఎండీ ఫయాజ్, కొలుపుల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News