- కాంగ్రెస్ నుంచి ఒకరు, బిఆర్ఎస్ నుంచి మరొకరు నర్సంపేట నాలుగో వార్డ్ ఎన్నిక రసవత్తరం
నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో రసవత్తరం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నాలుగో వార్డ్ జనరల్ రిజర్వు కావడంతో ఓకే ఇంటి నుండి కాంగ్రెస్ తరఫున బీరం భరత్ రెడ్డి, బి ఆర్ ఎస్ తరఫున బీరం నాగిరెడ్డిలు బరిలో నిలిచారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున అప్పటి మూడో వార్డులో పోటీ చేసిన బీరం నాగిరెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోగా మళ్లీ నాలుగో వార్డుకు చేంజ్ కావడంతో అదే నాగిరెడ్డికి టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసింది.
ఇదే ఇంటి నుండి బీరం నాగిరెడ్డి స్వంత తమ్ముడైన బీరం భరత రెడ్డి గత కొన్నియలుగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ భరత రెడ్డికి టికెట్ కన్ఫామ్ చేసి నాలుగో వార్డు బరిలో నిలిపింది. ఇదే వార్డులో బిజెపి మరో ఇద్దరు ఇతర పార్టీల నాయకులు ఉండగా వీరిద్దరు ఎన్నిక పట్ల పలువురు ఆసక్తిగా సమీకరణాలు చేస్తున్నారు. ఈనెల 11వ తేదీన జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇద్దరు అన్నదమ్ములు ఫోటో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో 13వ తేదీన వెలుపడే ఫలితాలపై ఒకే ఇంటిలో విషాదం కొంత ఆనందం కొంత నెలకొన నుంది.
