Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD | ఛైర్మన్‌గా ఏడాది పూర్తిచేసుకున్న బీఆర్ నాయుడు

TTD | ఛైర్మన్‌గా ఏడాది పూర్తిచేసుకున్న బీఆర్ నాయుడు

ప్రెస్‌మీట్‌లో వివరాల వెల్లడి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌(Chairman)గా బీఆర్ నాయుడు(BR Naidu) ఏడాది పూర్తి చేసుకున్నారు(One Year Completed). ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చిన మార్పులను ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. టీటీడీలోని అన్యమతస్తులను తొలగించాలని మొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏఐ టెక్నాలజీ (AI Technology) ద్వారా రెండు మూడు గంటల్లోనే సామాన్య భక్తులకు దర్శనం కలుగుతోందని చెప్పారు. శ్రీవారి అన్నప్రసాదంలో మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు. లడ్డూ (Laddu) ప్రసాదంలో నాణ్యత పెంచామని వివరించారు. అన్న ప్రసాదంలో వడను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

- Advertisement -

ఇంకా ఆయన ఏమన్నారంటే..

తిరుపతి స్థానికులకు నెలలో ఒక మంగళవారం స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. గతంలో టూరిజం టికెట్లు (Tourism Tickets) 4 వేల వరకు ఇచ్చేవారు.. అవి బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లేవి. తిరుమలలో కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లకు స్వామివారి పేర్లు వచ్చేలా పెట్టాం. స్విమ్స్‌ ఆస్పత్రి నిర్వాహణ,అభివృద్ధి, ఆర్థిక వనరుల సమీకరణ కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా స్విమ్స్‌ ఆస్పత్రికి రూ.71 కోట్లు ఇచ్చాం. బ్రేక్‌ దర్శనం సమయాల్లోనూ మార్పులు తీసుకొచ్చాం. శ్రీవారి ట్రస్ట్‌ ద్వారా 5వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం. టీటీడీకి వంద ఎలక్ట్రిక్‌ బస్సులు (Electric Busses) ఇవ్వాలని కేంద్ర మంత్రి కుమారస్వామి(Kumara Swami)ని కోరాం. కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.

దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో నిత్యాన్న ప్రసాదం. ఈ బస్సులను తిరుమల నుంచి తిరుపతికి నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ప్రారంభమైంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా సహాయంతో అలిపిరి పాదాల మండపం పునః నిర్మాణం. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాల నిర్మించబోతున్నాం. ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఒంటిమిట్టలో భక్తుల సౌకర్యార్ధం వంద గదులతో వసతి గృహ నిర్మాణం
ఎస్వీ గోశాల అభివృద్ధికి నిపుణుల కమిటీ. కమిటీ సూచనల మేరకు గోశాలను మరింత అభివృద్ధి చేస్తున్నాం. 5000 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించాం. దీనికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తాం. 5000 అనుకున్నాం, వీటి సంఖ్య పెరగవచ్చు. పరకామణిలో చోరీ ఘటనపై సీఐడీ ఎంక్వైరీ కొనసాగుతోంది. తిరుపతిలో ఉన్న ఫ్లైఓవర్‌ పేరును గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా మార్చింది. ఫ్లైఓవర్‌కు తిరిగి చంద్రబాబు పెట్టిన గరుడ వారధిగా పేరు మార్చాం. గత ప్రభుత్వం అలిపిరిలో ముంతాజ్‌ హోటల్‌ కోసం 20 ఎకరాలు కేటాయించింది. ముంతాజ్‌ హోటల్‌ భూముల లీజును రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేవలోక్‌, ముంతాజ్‌ హోటల్స్‌, ఎంఆర్‌కేఆర్‌ ప్రోప్టరీస్‌. టూరిజం హోటల్‌ మేనేజ్మెంట్ కాలేజీకి ఇచ్చిన 50 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించాలని తీర్మానించాం.

పోటు కార్మికులకు జీఎస్టీ కట్‌ కాకుండా..వారి వేతనం పెంచాం. స్విమ్స్‌ హెల్త్‌ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. 650 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, డ్రైవర్లను రెగ్యులరైజ్‌ చేయాలని తీర్మానం చేశాం. గత ప్రభుత్వం 1500 షాపులు అక్రమంగా కొండ మీద నెలకొల్పింది. వాటిని క్రమబద్దీకరిస్తున్నాం. భక్తులకు టీటీడీ సిబ్బంది మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులకు నేమ్‌ బ్యాడ్జ్‌ ఇవ్వాలని నిర్ణయించాం. స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా నడుస్తుంది. దీనికి అడ్డుకట్ట వేస్తూ షాప్స్‌ నిర్వాహణకు చర్యలు తీసుకుంటున్నాం. స్విమ్స్‌ ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్ధం. స్విమ్స్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ షాపుల నిర్వహణ చేసేలా ఏర్పాట్లు. తిరుపతి ఎయిర్‌ పోర్టుకు శ్రీ వేంకటేశ్వరా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అని నామకరణం చేయాలని నిర్ణయించాం.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని క్యాబినెట్‌లో చర్చించి, కేంద్రానికి సిఫార్సు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అమరావతిలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో అనేక అక్రమాలున్నాయి. చేసిన డిజైన్‌కు, నిర్మించిన ఆలయానికి సంబంధం లేదు. 175 కోట్ల రూపాయల వ్యయంతో అమరావతిలోని శ్రీవారి ఆలయాన్ని అభివృద్ది చేస్తాం. గత యేడాది వైకుంఠ ఏకాదశి ఘటనను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సైబర్‌ నేరాలు అరికట్టేందుకు తిరుపతిలో సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏర్పాటు చేశాం. శ్రీవాణి దర్శనం సమయాలను మార్చడంతో భక్తులకు దర్శనం సులభతరమైంది. అలిపిరి చెక్‌పోస్టును ఆధునీకరిస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News