- బోరు మోటర్లను ప్రారంభించిన సర్పంచ్ కొమ్ము కృష్ణ.
- మాటిచ్చాను…అమలు చేశాము.
- వార్డు సభ్యులు దార సురేష్.
గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్పంచ్ కొమ్ము కృష్ణ పేర్కొన్నారు.నందిగామ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో నూతన బోరు మోటర్లను సర్పంచ్ కొమ్ము కృష్ణ, పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజుల నుంచి బోర్లు పాడయ్యాయని, పట్టించుకునే వారు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.అందుకోసమే ప్రధానంగా నీళ్ల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నూతన మోటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాం.
ఎన్నికల సమయంలో 4వ వార్డులో నూతన బోరు మోటార్ వేయిస్తామని మాటిచ్చాను..ఇప్పుడు అమలు చేశామని 4వ వార్డు సభ్యులు దార సురేష్ హర్షం వ్యక్తం చేశారు.నిత్యావసరాల కోసం కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.అందుకోసమే వారి సమస్య పరిష్కారం చేసినందుకు గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, అధికారులు, నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
