తెలంగాణలోని పోనికి చెట్టు (Poniki Tree) (గివోటియా రోట్లెరిఫార్మిస్) శాస్త్రీయ ప్రోత్సాహాన్ని పొందుతోంది. ములుగులోని FCRI పరిశోధకులు విప్లవాత్మక అంకురోత్పత్తి సాంకేతికత(Revolutionary Germination Technique)ను అభివృద్ధి చేశారు. తద్వారా ఈ అరుదైన చెట్టుకు 75–80% విత్తన అంకురోత్పత్తిని సాధించారు. ఇది నిర్మల్ బొమ్మలు & హస్తకళల(Nirmal Toys & Handicrafts)కు కీలకమైంది. పేలవమైన పునరుత్పత్తి, విత్తన నిద్రాణస్థితి, ఆవాస క్షీణత కారణంగా ఈ జాతులు అంతరించిపోయాయి.

ఇది నిర్మల్ కళాకారుల(Nirmal Artisans)కి కావాల్సిన ముడి పదార్థాల సరఫరాకు ముప్పు కలిగిస్తోంది. కొత్త సాంకేతికత.. పోనికి చెట్ల పునరుజ్జీవనానికి దోహదపడుతుంది. వందలాది మంది కళాకారుల కుటుంబాలకు భరోసా కల్పించనుంది. తెలంగాణ రాష్ట్రం GI ట్యాగ్ పొందిన నిర్మల్ క్రాఫ్ట్ వారసత్వాన్ని సంరక్షిస్తుంది. పెద్దఎత్తున తోటల పెంపకం, పర్యావరణ పునరుద్ధరణకూ తలుపులు తెరుస్తుంది. చెట్టు ఔషధ లక్షణాలను ఉపయోగించుకుంటుంది. శాస్త్రాన్ని, సంస్కృతిని, జీవనోపాధిని మిళితం చేయటం ద్వారా వారసత్వాన్ని భద్రపరచడానికి, స్థిరత్వం పొందడానికి ఉపయోగపడుతుంది.

