Friday, March 6, 2026
HomeజాతీయంDharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇకలేరు

Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇకలేరు

బాలీవుడ్ (Bollywood) సీనియర్ నటుడు (Senior Actor) ధర్మేంద్ర ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. పరిస్థితి విషమించటంతో 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. గత నెల 31న ఆయన ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కానీ.. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీంతో.. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ధర్మేంద్ర మరణవార్త తెలిసి రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ప్రధాని మోదీ (PM Modi) తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు నివాళులు (Tributes) అర్పిస్తున్నారు. ధర్మేంద్రతో ఉన్న మెమొరీస్‌ని షేర్ చేస్తున్నారు. ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న జన్మించారు. ఆయన 1954లో మొదటి వివాహం(ప్రకాష్ కౌర్‌తో), 1980లో రెండో పెళ్లి (సీనియర్ నటి హేమమాలినితో) (Hemamalini) చేసుకున్నారు. మొత్తం ఆరుగురు సంతానం.

- Advertisement -

1960లో నటుడిగా కెరీర్ ప్రారంభించి షోలే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్, అనుపమ, బందినీ, అన్‌పఢ్ తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తన నటనకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2012లో పద్మభూషణ్‌ (PadmaBhushan) వరించింది. 2004లో బీజేపీ ఎంపీ(Bjp Mp)గా గెలిచి రాజకీయాల్లోనూ రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News