Wednesday, February 11, 2026
Homeవరంగల్‌BJP | బస్టాండ్‌లో పడవ ప్రయాణం

BJP | బస్టాండ్‌లో పడవ ప్రయాణం

వరంగల్‌లో బీజేపీ వినూత్న నిరసన

వరంగల్‌(Warangal)లో బీజేపీ వినూత్న నిరసన (Innovative Protest) తెలిపింది. తూర్పు వరంగల్ బస్టాండ్ (Bus Stand) నిర్మించాల్సిన ప్రదేశం వర్షపు నీటికి (Rain Water) నిలయంగా, స్మిమ్మింగ్ పూల్‌(Swimming Pool)లా మారిందని పట్టిచూపింది. పడవలో ప్రయాణించి సమస్యను హైలైట్ చేసింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల (BRS-Congress Parties) వైఫల్యం (Failure) వల్ల బస్టాండ్ కాస్తా బస్సు ప్రయాణాలకు బదులు బోటు ప్రయాణాలకు (Boat Journey) వేదికగా మారిందని నేతలు విమర్శించారు.

- Advertisement -

వరంగల్ ఈస్ట్ బస్టాండ్ నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ నత్తనడకనే సాగుతున్నాయని మండిపడ్డారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ఈ రెండు పార్టీల కారణంగా చారిత్రాత్మక, సాంస్కృతిక వైభవం కలిగిన వరంగల్‌కు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందట్లేదని ధ్వజమెత్తారు. ఈ నిర్లక్ష్య పాలనను ఎండగట్టేందుకే నిరసన చేపట్టామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ చిత్రపటాలను ధరించి పడవలో ప్రయాణించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News