కరీంనగర్ స్థానిక హనుమాన్ నగర్ లో గల బ్లూ బెల్స్ హై స్కూల్ లో శనివారం సంక్రాంతి పండుగను విద్యార్థులలో భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో రంగోలీ పోటీలు ఏర్పాటు చేయగా, వివిధ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు సంక్రాంతి పండుగ విశిష్టత, గ్రామీణ సంస్కృతి, ప్రకృతి ప్రేమను ప్రతిబింబించాయి.

పాఠశాల ప్రాంగణం మొత్తంపండుగ వాతావరణంతో కళకళలాడింది.విద్యార్థుల సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు రంగోలీ రూపాల్లో స్పష్టంగా కనిపించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ జంగా సునీత మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలోకళా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచన,సహకార భావన మరియు సాంస్కృతిక అవగాహననుపెంపొందించడంలో ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

ఈ సందర్భంగా పండుగలను సంప్రదాయ పద్ధతిలో ఆనందంగా, సామరస్యంగా జరుపుకోవాలని విద్యార్థులకు సందేశమిచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

