పోలీస్ అమర వీరుల వారోత్సవాల (Police Martyrs’ Week Celebrations) సందర్భంగా ఈ నెల 28న నేలకొండపల్లి (Nelakondapalli) మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) విజయవంతం చేయాలని ఎస్ఐ సంతోష్ ఒక ప్రకటనలో కోరారు. రోడ్డు ప్రమాద బాధితులు, తలసేమియా (Thalassemia), సికిల్ సెల్(Sickle cell), డెంగీ(Dengue) వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం చాలా ఉందని చెప్పారు. ఈ రోగాల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి బ్లడ్ బ్యాంకు(Blood Bank)లో నిల్వలు లేకపోవడంతో మరణాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రక్తదాన శిబిరం ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్ఐ సంతోష్ పిలుపునిచ్చారు.
