Tuesday, March 3, 2026
HomeజాతీయంAmit Shah | పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే విజయం

Amit Shah | పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే విజయం

పశ్చిమ బెంగాల్(West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ ‌షా అన్నారు. ఆ రాష్ట్రంలోని మమతా బెనర్జీ(Mamatha Benerjee) ప్రభుత్వం అక్రమ వలస(Infiltration)లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కోల్‌కతా(Kolkata)లో మంగళవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇప్పటికే దీదీని ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు ఎద్దేవా చేశారు. డిసెంబర్ 30వ తేదీ భారతీయులు గర్వించదగ్గ రోజని, 1943లో ఇదే రోజున పశ్చిమ బెంగాల్ ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) భారత పతాకాన్ని పోర్ట్ బ్లెయిర్‌లో ఎగురవేశారని గుర్తుచేశారు. ఈ సంవత్సరం ఇవాళ్టి నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల వాతావరణం నెలకొంటుందని చెప్పారు. టీఎంసీ పాలన(TMC Rule)లో గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో భయాందోళన, అవినీతి, దుష్పరిపాలన, అక్రమ వలసలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News