నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే, పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం హామీలను అమలుచేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు.రైతుభరోసా కింద రూ. 15 వేలు ఇవ్వాలని, రుణమాఫీ పూర్తి చేయాలని, మహిళలకు ఆసరా పింఛన్లు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
- Advertisement -
