- విచ్చలవిడిగా తిరుగుతున్న జిహెచ్ఎంసి చెత్త లారీలు.
- అధికారులు పట్టించుకోకపోతే, టెంట్ వేసుకుని కూర్చుంటామని బిజెపి నాయకుల హెచ్చరిక..
జవహార్ నగర్ బిజెపి పశ్చిమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చల్ నియోజకవర్గం, జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదయ్య, ట్రాఫిక్ సీఐ డి. శివశంకర్ ని కలిసి జవహర్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న జిహెచ్ఎంసి డంపింగ్ యార్డ్ చెత్త లారీల పైన ఫిర్యాదు చేయడం జరిగిందని బిజెపి నాయకుడు రంగుల శంకర్ తెలిపారు. సదరు విషయంపై సానుకూలంగా స్పందించిన పోలీసు అధికారులు జోహార్ నగర్ ప్రజల సమస్య దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాలాజీ నగర్ ప్రధాన రహదారి గుండా చెత్త లారీలు రాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసినట్టు అన్నారు.

ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే జిహెచ్ఎంసి చెత్త లారీల విషయంలో త్వరలోనే జవహర్ నగర్ కమాన్ దగ్గర టెంట్ వేసుకొని కూర్చుంటామని బిజెపి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జవహార్ నగర్ లో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు మరాఠి బాబు, బీజేవైఎం మాజీ అధ్యక్షులు రామ్ నాయక్, బిజెపి ప్రధాన కార్యదర్శి వేపుల సన్నీ, గిరిజన మోర్చా అధ్యక్షులు రాజు నాయక్, బిజెపి కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
