Wednesday, March 18, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంBharatiya Vidya Bhavan | విద్యావనంలో రాంబంధు!

Bharatiya Vidya Bhavan | విద్యావనంలో రాంబంధు!

సైనిక్పురి భవన్సు పట్టి పీడిస్తున్న ఒకేఒక్కడు..

  • పీఈటీ నుంచి వైస్ ప్రిన్సిపాల్గా ‘పిల్లి రాము’
  • వైస్ ప్రిన్సిపాల్ హోదాతో అధికార దుర్వినియోగం
  • ఉద్యోగులపై వేధింపులు, బలవంతపు తొలగింపులు
  • మరో మహిళా ఉద్యోగితో కలిసి దందాలు..
  • నిబంధనలు పక్కన పెట్టి పోస్టులు, ప్రమోషన్లు
  • భవన్స్ ప్రతిష్టను మసకబారుస్తున్న అక్రమాలు
  • కమిటీలున్నా నిర్ణయాలు మాత్రం ఒక్కరి చేతుల్లోనే..

సైనికపురిలోని ఘన చరిత్ర కలిగిన భవన్స్ ప్రతిష్టకు ఒక వ్యక్తి అహంకారం తలవంపులు తెస్తోంది. ఒకప్పుడు క్రమశిక్షణకు, ఉన్నత విలువలకు మారుపేరుగా నిలిచిన ఈ విద్యావనం, నేడు ఒకే ఒక్కడి అరాచక పాలనలో బందీ అయింది.

- Advertisement -

సైనిక్ పురిలోని ఘన చరిత్ర కలిగిన భవన్స్ ప్రతిష్టకు ఒక వ్యక్తి అహంకారం తలవంపులు తెస్తోంది. ఒకప్పుడు క్రమశిక్షణకు, ఉన్నత విలువలకు మారుపేరుగా నిలిచిన ఈ విద్యావనం, నేడు ఒకే ఒక్కడి అరాచక పాలనలో బందీ అయింది. మేనేజ్మెంట్ కమిటీలు, వైస్ చైర్మన్లు, సెక్రటరీల ఉనికి నామమాత్రంగా మారిపోగా..

ఒక సాధారణ ఉద్యోగి విద్యాసంస్థ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. తన మాటే శాసనంగా, తన నిర్ణయమే అంతిమంగా మలుచుకుని సహోద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. భవన్స్ విద్యాసంస్థల ఘన చరిత్రను మసకబారుస్తూ, సంస్థను వ్యక్తిగత జాగీరుగా మార్చుకున్న ఆ ‘ఒక్కడి’ అరాచక సామ్రాజ్యంపై ‘అదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో ఏర్పడి.. గొప్ప చరిత్ర కలిగిన భవన్స్ విద్యా వనం నేడు ఓ ఛీడ పురుగు చేతిలో బంధీ అయింది. మేనేజ్మెంట్, ఇతర ఏ కమిటీలు లేవు.. వైస్ ఛైర్మన్, సెక్రటరీ, డైరెక్టర్లు వీరంతా ఉన్నా లేనట్టే.. అంతా ఒకే ఒక్కడు.. అన్ని రకాల పదవులను ఎంజాయ్ చేస్తున్నాడు. అతడే పీఈటీ, అతడే పీడీ, అతడే వైస్ ప్రిన్సిపాల్. ఇదే కాదు అతడొక నియంతలా మారి.. ఉద్యోగులపై కూడా ప్రతాపం చూపిస్తున్నాడు. భవన్స్ అంటేనే పిల్లి రాము.. పిల్లి రాము అంటేనే భవనా మార్చేశాడు. సైనిక్పురిలోని 50 ఎకరాల విశాలమైన భవన్స్ క్యాంపస్ను రాబంధుగా మారి ఏలుతున్నాడు..

సాధారణ పీఈటీగా చేరి :

1998లో పిల్లి రాము అందరి ఉద్యోగుల వలె పీఈటీగా భవన్స్లో చేరాడు. కొన్నేళ్ల పాటు పీఈటీగానే కొనసాగాడు. కరోనా వచ్చి ప్రపంచం అంతా ఆగం అయితే.. పీఈటీ రాముకు మాత్రం అదే ఒక వరంగా మారింది. భవన్స్ ఫౌండర్ మెంబర్, వైస్ చైర్మన్ జేఎల్ఎన్ శాస్త్రికి ఈ కరోనా సమయంలోనే పీఈటీ రాము దగ్గరయ్యాడు. ఒక వైపు శాస్త్రికి వయోభారం, మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. దీనిని రాము మంచిగా క్యాచ్ చేసుకున్నాడు.

ఇదే సమయంలో అంటే 2020లో రాము తనకు తెలిసిన ఓ మహిళా ఉద్యోగిని తెచ్చి పెట్టుకున్నాడు. ఆ మహిళకు చేరిన రోజే భారీ స్కేల్ జీతం ఇచ్చాడు. రెండో సంవత్సరంలోనే శాశ్వత ఉద్యోగిగా చేశాడు. ఇదంతా జరగాలంటే మిగతా వారికి 2-5 ఏళ్లు పడుతుంది. కానీ, రాము మాత్రం తన చేతిలో ఉన్న అధికారంతో చకచకా చేసేశాడు.. ఇదే కాదు ఆమె చేతిలోనే భవన్స్ పాలనా అంతా పెట్టేశాడు. తను కూడా 2022లోనే జూనియర్ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్గా పోస్టు రాసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి భవన్స్ను ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఉద్యోగుల మెడలపై కత్తి పెట్టి :

భవన్స్ అనేది ఒక అత్యున్నతమైన విద్యా సంస్థ. దీనిలో ఒక ఉద్యోగి లేదా వర్కర్ చేరినా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టే. కింది స్థాయి నాన్ టీచింగ్ ఉద్యోగులకు లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాలు, ఇతర అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇదే పద్దతిలో టీచింగ్ ఉద్యోగులకు కూడా ఉంటాయి. కానీ, రాము చేతిలోకి అధికారం వచ్చాక ముందుగా కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నాడు.

30 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగులను రకరకాల వేధింపులకు గురి చేస్తూ తొలగిస్తూ పోయాడు. కొందరిని వయస్సు, సర్వీసుతో సంబంధం లేకుండా మెడలు పట్టి బయటకు నెట్టిన సందర్భాలున్నాయి. ప్రతి సెక్షన్లో తన మనుషులతో నింపేసుకున్నాడు.

సర్వీస్ పెంచమంటే.. రిటైర్మెంట్ పెంన్షన్లు చేస్తూ :

భవన్స్లో నుంచి ఒక ఉద్యోగిని తొలగించాలంటే ముందుగా మెమోలు ఇవ్వాలి. ఏదైన ఒక ఉద్యోగి సర్వీసు పెంచాలని కోరితే నిబంధనల ప్రకారం అవకాశం కల్పించాలి. కానీ, ఈ రాంబంధు సామ్రాజ్యంలో అలాంటి వాటికి దేనికి అవకాశం లేదు. బాలయ్య అనే రికార్డు అసిస్టెంట్ సుమారు 32ఏళ్ల పాటు పని చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 చేసిన విషయం తెలిసిందే.

ఇదే విషయాన్ని బాలయ్య కూడా అడిగాడు. ఇదే విషయంపై బాలయ్యకు హైకోర్టు స్టే కూడా ఉంది. బాలయ్య తీరు రాముకు నచ్చలేదు. 2024లో బాలయ్యకు సంబంధం లేకుండా, చివరకు ఆయన లేకుండానే కాలేజీలో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసిన చరిత్ర పీఈటీ రాముకే దక్కుతుంది. బాలయ్య తరహాలోనే ఎలక్ట్రిషియన్ చిన్న కేశవులుకు సైతం 2024లోనే ఆయన ప్రమేయం లేకుండా, చిరవకు ఆయన లేకుండానే రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాడు.

50 ఏళ్లకు పైగా చరిత్ర ఉండి, ఉన్నతమైన ఆశయాలు, ఆకాంక్షలతో నడుస్తున్న భవన్స్ విద్యా సంస్థలో పీఈటీ రాము “రాం” బంధుగా మారాడు. భవన్స్ సామ్రాజ్యంలో కొంతమందిని సామంతులను, బినామీలను పెట్టుకొని దోపిడీ చేస్తున్నాడు. ఇలాంటివి కోకొల్లలు.. రేపటి సంచికలో “రాం” బంధు.. అవినీతి, అక్రమాలు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News