77వ గణతంత్ర దినోత్సవాల(Republic Day) సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma)తో కలిసి జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్నారు. అంతకుముందు వీరుల సైనిక స్మారకం వద్ద అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. రాజ్యాంగ(Constitution) విలువలే ప్రభుత్వానికి దిక్సూచి అని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరువ చేస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -
