- మత విధ్వేషంతో రాజకీయాలు సమాజానికి నష్టం
- ఉపాధిహామీ చట్టాన్ని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర
- జనవరి 26న కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలి : డిప్యూటీ సీఎం భట్టి
దేశ రక్షణకు కాంగ్రెస్ భావాజాలం ఒక్కటే మార్గమని, కాంగ్రెస్ భావాజాలం బతికి ఉంటేనే దేశ రక్షణ సాధ్యమవుతుందని తెలంగాణరాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లాకాంగ్రెస్‌కార్యాలయంలో జాతీయకాంగ్రెస్‌పార్టీ 140 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు.ఈసందర్భంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారా యణగౌడ్ అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో భట్టి మాట్లాడారు. ఈదేశ సంపద, వనరులు దోపిడీకి గురవుతుంటే స్వాతంత్య్రం తీసుకువచ్చి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించిన చారిత్రాత్మకమైన రోజు డిసెంబర్ 28 అని అన్నారు.
ఈదేశంలో కొన్ని శతాబ్దాలుగా మతాలు, కులాలు ఎలాంటి బేధం లేకుండా కలిసి జీవనం సాగిస్తున్నా యని, కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాలు మతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నాయన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడిచి, పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుదని, ఇది సరైన విధానం కాదని హెచ్చరించారు. ఈ దేశ సంపద వనరులు కార్పోరేట్ వ్యవస్థలకు వ్యక్తులకు పంచడానికి కాదన్నారు. గొప్ప ఆశయంతో ఉపాధి హామీ పథకానికి లక్షకోట్ల బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటాయిస్తే ఆ పథకాన్ని కనుమరుగు చేసే కుట్ర జరుగుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీని ప్రపంచమంతా జాతిపితగా కొలుస్తుంటే స్వాతంత్య్రం వచ్చి ఆరు నెలలు తిరగకముందే ఆర్‌ఎస్‌ఎస్ భావాజాలం కలిగిన వ్యక్తులు ఆయనను భౌతికంగా నిర్మూలిం చారు కాని ఆయన ఆలోచనను నిర్మూలించలేరని అన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రప్రభుత్వం చేస్తు న్న కుట్రను ఎండగట్టేందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, దేశప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఇచ్చిన పిలుపుమేరకు పేదల కోస కాంగ్రెస్‌పార్టీ గ్రామ గ్రామాన పోరాటం ఉధృతం చేస్తుందన్నారు.ఈదేశానికి, రాష్ట్రానికి సమాజంలోని అన్ని వర్గాలకు కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేశాయో వివరించేందుకు జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని కాంగ్రెస్‌కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆరోజు ప్రతి ఇంటిపైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, కాంగ్రెస్‌పార్టీ భావాజాలాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచాలని, కండువాలు ధరించాలని తెలిపారు.
దేశ స్వాతంత్య్రం సాధించిన సమయంలో ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనీసం గుండుసూది కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఆపరిస్థితి నుంచి బయటికి వచ్చి హరిత విప్లవం, శ్వేత విప్లవం ద్వారా పంచవర్షప్రణాళికలతో దేశానికి కాదు ప్రపంచానికి ఆహార ధాన్యాలు సరఫనాచేసే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే అది కాంగ్రెస్‌పార్టీ ద్వారానే సాధ్యమని డిప్యూటీసిఎం అన్నారు.నవోదయ విద్యాలయాలు,సైంటిఫిక్ టెంపర్‌మెంట్ ఈదేశంలో నిలబడేందుకు సైన్స్, టెక్నాలజీ ముందుభాగంలో ఉండాలని నెహ్రు కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు అనేక వ్యవస్థలను ఈ దేశంలో ఏర్పాటు చేశారు అంటే అది కాంగ్రెస్‌పార్టీ ద్వారానే సాధ్యమైందన్నారు.అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలతో పోటీపడి ఎందుకు ఐఐటీలు, ఐఐఎంలు కాంగ్రెసపాలనలోనే స్థాపించబడ్డాయి, అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓలుగా భారతీయులు రాణిస్తు న్నారు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఐఐఎం వంటి మేనేజ్మెంట్ సంస్థలే కారణమని తెలిపారు.
పుట్టిన ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ప్రతి పౌరునికి ఆహారం అందించే నైతిక హక్కు వంటి చట్టాలు కాంగ్రెస్ పాలనలో వచ్చాయన్నారు. అతిపెద్దప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడడానికి అవసరమైన రాజ్యాంగానిన్ర అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, పాకిస్తాన్ మయన్మార్ వంటి దేశాల్లో పరిపాలనను ఆర్మీచేతిలోకి తీసుకోవడం, ప్రధానులు హత్యకు గురి కావడం వంటి సంఘటనలు జరుగుతుంటే మన దేశంలో మాత్రం ఎన్నికల తర్వాత ఎవరు గెలిస్తే వారు ఎటువంటి వివాదం లేకుండా అధికారం మార్పిడి జరుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్‌పార్టీ మాత్రమేనని తెలిపారు.ఓటుహక్కును రక్షించుకోవడం మనందరి బాధ్యత భారతజాతి ఔన్నత్యం కోసం కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధుడై పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈదేశ సమగ్ర, సమైక్యత కోసం గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ జీవితాన్ని అంకితం చేశారని భట్టి తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగండ్ల దీపక్‌చౌదరి, రాష్ట్రగిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, శాసనసభ మాజీ సభ్యులు కోటేశ్వరరావు, తెలంగాణరాష్ట్ర పంచాయతీరాజ్ సంఘటనఇన్‌ఛార్జీ సుభాష్‌ఎక్కర, చోటాబాబా, వడ్డేబోయిన నరసింహారావు, యడ్లపల్లి సంతోష్, అంజనీకుమార్, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు సౌజన్య, సీతారాములు, బందయ్య, శేఖర్‌గౌడ్, వీరభద్రం, బాలగంగాధర్‌తికల్, వెంకటేశ్వరరావు, మలీదు వెంకటేశ్వరరావు, సైదులునాయక్, రాపర్తి శరత్, వైష్ణవిప్రసన్న కృష్ణ, మాజీ కౌన్సిలర్లు నాగేశ్వరరావు, రంగా జనార్ధన్, గంగరాజుయాదవ్, సీతారా ములు, అనిల్, ప్రవీణ్‌కుమార్, రవికుమార్, వెంకటేశ్వరరావు, జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
