భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన మరియు సోషల్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను,తెలంగాణ ఉద్యమ శిఖరం, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు కేసీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన, కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనము.
తెలంగాణకు ప్రతిరూపం కేసీఆర్. కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ సమాజానికే నోటీసులు ఇచ్చినట్టేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అన్నారు. రేవంత్ రెడ్డిలో తీవ్ర అభద్రతాభావం పెరిగిపోయిందని, తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కప్పిపుచ్చుకునేందు సిట్‌లు, కమిషన్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజలను కన్‌ఫ్యూజ్ చేయాలన్న దురుద్దేశంతోనే ఈ నోటీసుల డ్రామా చేస్తున్నారూ.
తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు కానీ.. పూటకో డైవర్షన్ డ్రామాలు చేస్తూ రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడు. రేవంత్ రెడ్డి అవివేకపూరిత, పిల్ల చేష్టలతో కూడిన పాలనలో ప్రభుత్వ సంస్థలు స్వతంత్రత కోల్పోయి కేవలం కీలుబొమ్మలుగా మారాయి. తెలంగాణ చరిత్రను లిఖించిన నాయకుడు, రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు రేవంత్ రెడ్డి పిల్ల చేష్టలతో మలినం అంటించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలు చివరికి ఆయనే ప్రజల్లో నవ్వులపాలు అవుతారూ.
ఇట్లు ,
ఎంటెక్ మహేందర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన మరియు సోషల్ మీడియా నాయకులు.
