Saturday, October 4, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంఉత్తమ కమీషనరా? ఉత్త కమీషనరా?

ఉత్తమ కమీషనరా? ఉత్త కమీషనరా?

పీర్జాదిగూడ మున్సిపల్‌ లో.. పన్నులు కట్టించుకోగానే కాదు. మౌళిక వసతులెక్కడ?
ఉత్తమ కమీషనర్‌ ప్రజల బాధలు పట్టించుకోరా ?
పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో అద్వాన స్థితిలో రోడ్లు
అయోధ్య నగర్‌లో అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ
చిన్నపాటి కుంటలను తలపిస్తున్న కాలనీల రోడ్లు
పార్కులలో ఓపెన్‌ జీమ్‌ మాయమైన పట్టించుకోని సిబ్బంది

అది పేరుకే మున్సిపల్‌ కార్పోరేషన్‌.. ప్రజల సమస్యలు పట్టవు.. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోరు రోడ్ల పై ఎటుచూసిన డ్రైనేజీ నీరే.. దుర్గందంతో సహవాసం చేయాల్సిందే చిన్నపాటి వర్షాలకే రోడ్ల పై డ్రైనేజీ నీటి ప్రవాహం.. అస్తవ్యస్థంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ.. రోడ్ల మరమ్మత్తు చేయరు.. వర్షం పడితే చాలు భయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన దుస్థితి.. కనీసం నడవలేని స్థితిలో రోడ్లు.. అయినా ఇక్కడ కమీషనర్‌కు మాత్రం ఉత్తమ కమీషనర్‌గా గుర్తింపు.. అదేంటి అనుకుంటున్నారా.. ప్రజల ముక్కుపిండి మరీ పన్నులు వసూళ్లు చేస్తారు.. అందుకే అయన ఉత్తమ కమీషనర్‌… మరి పన్నులు వసూళ్లు చేస్తున్న కమీషనర్‌ ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోరు.. ఇది ఇక్కడి ప్రజలు మున్సిపల్‌ అధికారులను అడుగుతున్న ప్రశ్న..


నగరంలోని పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న కమిషనర్‌ ఉత్తమ కమిషనర్‌గా ఉండడం సంతోషకరమైన విషయమే. ఎలాగైతే ప్రజల నుండి పన్నులు వసూళ్లు చేయడంలో నిఖచ్చితగా వ్యవహరిస్తున్నారో అదే రీతిలో కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. కార్పొరేషన్లలోని పలు కాలనీలలో డ్రైనేజీల లీకేజీతో విపరీతమైన దుర్వాసనతో రోడ్ల పై ఎక్కడ చూసిన చిన్నపాటి సెలయేరుల ప్రవహిస్తుంటాయి. ఈ డ్రైనేజీ నీటి కారణంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మహిళలు రోడ్లపై నడవలేని పరిస్థితితో నరకయాతన పడుతున్నారు.

ఒకటవ వార్డు అయోధ్య నగర్‌ లో లే పారుతున్న డ్రైనేజీ నీరు… ఒకటవ వార్డు అయోధ్య నగర్‌ కాలనీలో చిన్న వర్షానికి డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహిస్తూ కాలనీ ప్రజలకు చాలా ఇబ్బందిగా మారింది. ఇంట్లో నుండి బయట కాలు పెట్టలేని దుర్భర పరిస్థితుల్లో కాలనీవాసులు ఉన్నారు. ఈవిషయాని మున్సిపల్‌లో ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా కూడా తూతు మంత్రంగా పనిచేస్తూ వెళ్తుంటారే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఎన్నడూ ఆలోచించరు.


కాలనీలలో రోడ్లు గుంతల మయంతో…
కాలనీలలో రోడ్లు గుంతలమయం కావడంతో వాహనాలు నడపాలంటే, వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనబడుతుంది. గుంతల రోడ్ల వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తాత్కాలికంగానైనా ఇంత ప్యాచ్‌ వర్క్‌ చేద్దామని సోయలేని అధికారులు ఉన్నంతకాలం కార్పొరేషన్‌ ప్రజలకు తిప్పలు తప్పవు.


ఒకనాడు కార్పొరేషన్‌ లోగల పార్కులలో వాకింగ్‌ ట్రాక్‌లు జిమ్‌లు నేడు దీనస్థితిలో..!
గతంలో కార్పొరేషన్‌ పార్కులలో వాకింగ్‌ ట్రాక్‌ లతో ఓపెన్‌ జిమ్‌లు కలకలలాడేవి. ప్రజలు తమ ఆరోగ్యం కోసం ఉదయం సాయంకాలం వేళల్లో రకరకాల వ్యాయామలతో జిమ్లను వాడుకునేవారు. అవి విరిగిపోయి, నేడు కంటికి కనిపించకుండా పోయాయి. కనీసం వాటిని రిపేర్‌ చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకువద్దాం అన్న ఆలోచన లేనేలేదు.
ప్రజల నుండి అత్యధికంగా బలవంతగా పన్నులు వసూలు చేయడం గొప్ప కాదు. ఇప్పటికైనా ప్రజలకు మౌలిక వసతులు కల్పించి ఉత్తమ కమిషనర్‌ గా పేరు తెచ్చుకోవాలని కార్పొరేషన్‌ ప్రజలు ఆశిస్తున్నారు.

peerzadiguda municipal corporation
peerzadiguda municipal corporation
RELATED ARTICLES
- Advertisment -

Latest News