Monday, April 13, 2026
Homeక్రైమ్ వార్తలుArrest | కిడ్నపులు చేస్తున్న విద్యార్థుల ముఠా..

Arrest | కిడ్నపులు చేస్తున్న విద్యార్థుల ముఠా..

  • బెంగుళూరులో వెలుగు చూసిన ఘటన..
  • పోలీసుల అదుపులో నలుగురు విద్యార్థులు..

విలాసవంతమైన జీవితం గడిపేందుకు కొందరు విద్యార్థులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. తోటి విద్యార్థులను కిడ్నాప్‌ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక క్లాస్‌మెట్‌ కిడ్నాప్‌తో వీరి గుట్టు రట్టయ్యింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. బీహార్, జార్ఖండ్, కేరళ, బెంగళూరుకు చెందిన నలుగురు విద్యార్థులు జల్సాలకు అలవాటుపడ్డారు. విలాసవంతమైన జీవితం కోసం వారు ఒక ముఠాగా ఏర్పడ్డారు.

పలువురు విద్యార్థులను కిడ్నాప్‌ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిందితులైన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరానికి వినియోగించిన నకిలీ మెటల్‌ గన్‌, కత్తి, కారును స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు పాత నేరస్తులని, ఒక ముఠాగా పనిచేస్తున్నారని పోలీస్‌ అధికారి తెలిపారు. జల్సాలకు డబ్బుల కోసం పలువురు విద్యార్థులను వారు బెదిరించినట్లు దర్యాప్తులో తెలిసిందని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News