నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు.. ఈ ప్రపంచం నిన్ను నమ్మాలని కోరుకోవడం అమాయకత్వమే అవుతుంది.. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడమే మనం చేసే మొదటి తప్పు.. ఇతరుల విమర్శలకు భయపడి నీ అడుగులు ఆపేయకు.. ఎందుకంటే విమర్శించే పెదవుల కంటే సాయం చేసే చేతులు తక్కువగా ఉండవచ్చు కానీ, నీ సంకల్పం బలంగా ఉంటే ఏ శక్తీ నిన్ను ఆపలేదు.. నీ ఆలోచనలే నీ భవిష్యత్తుకు శిల్పులు.. గెలిచినప్పుడు పొగిడే లోకం, ఓడిపోయినప్పుడు నిందించడం సహజం.. అందుకే లోకం మాటలను పక్కన పెట్టి, నీ మనసు చెప్పే మాట విను.. నీ సామర్థ్యం ఏంటో నీకు తెలిస్తే చాలు.. ఈ ప్రపంచం ఏదో ఒకరోజు నీ దగ్గరకు వస్తుంది.. నిన్ను నువ్వు నమ్ము.. నీ ప్రయాణాన్ని నువ్వే ధైర్యంగా సాగించు.. అప్పుడే విజయం నీ చిరునామా వెతుక్కుంటూ వస్తుంది.
- చిట్టిమళ్ళ మహేందర్
- Advertisement -
