Friday, February 27, 2026
Homeసాహిత్యంసంఘర్షణ

సంఘర్షణ

ఆకర్షనీయమైన ఆ కళ్ళు
ఎన్నో హృదయాలకు
గుచ్చేసాయి ముళ్ళు
పాపం సంపాదనకు
పడిపోయింది చిల్లు

ఘర్షనకు గురయ్యాయి
సామాజిక మాద్యమాలన్నీ…
సంఘర్షనతో
చెవులు గిల్లుకున్నాయి
సినీ పరిశ్రమలన్నీ…

- Advertisement -

దర్శకులందరూ గుసగుసలు
సినీ తారలంతా రుస రుసలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన
అభిమానుల పుట్టుకతో
పారిపోయిందామే గుట్టుగా..

కుంభమేలకు వెళ్ళినోళ్ళంతా
పూసలేసుకున్న అమ్మాయి చెంత
ఏమిటో ఊహించనీ వింత
భగవంతుణ్ణే మరిచారు భక్తులంతా
ఎక్కడినుండి వచ్చిందో ఆ ప్రకృతికాంత

రాత్రికి రాత్రే వీసాతో పనిలేకుండా
రాష్ట్రాల్నే దాటేసిన మోనాలీసా
నాసా వెళ్ళినోళ్లకు లేనంత ప్రచారం
ఒక్కసారిగా నెట్టింట మిగిలింది విచారం
ఎవరు నేర్పారో మానవునికీ ఆచారం

వాసి జ్యోత్స్న
9866843005

- Advertisement -
RELATED ARTICLES

Latest News