Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణBC Reservations: శత్రువును పసిగట్టలేని బీసీ సమాజం

BC Reservations: శత్రువును పసిగట్టలేని బీసీ సమాజం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సమకాలీన బిసి 42% రిజర్వేషన్స్ అంశంపై వ్యాసం

భారతీయ పౌర సమాజంలో ప్రస్తుతం అంతర్గతంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలల్లో అతిపెద్దది కుల గణనతో కూడిన జన గణన. మరి ముఖ్యంగా చెప్పాలంటే బీసీ కులాల సమస్యలే నేడు దేశ సమస్య మరి ఇంత పెద్ద సమస్యకి శాశ్వత పరిష్కార మార్గం చూపించకుండా, అగ్రకుల పాలకవర్గాలు తరతరాలుగా బీసీ ల స్థితిగతులను మార్చడానికి పాటుపడడం లేదు, అంటే ఉద్దేశపూర్వకంగానే ఆయా రాష్ట్రాలను, కేంద్రాన్ని పాలిస్తున్న అగ్రకుల పాలకవర్గాలు పార్టీలకతీతంగా బీసీ కులాల అభివృద్ధి వ్యతిరేకులుగా నిరూపించుకుంటున్నారు కదా.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయ సమకాలీన అంశాల్లో బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలనే అంశం విపరీతంగా చర్చకు వస్తున్నది, అందుకు ప్రధాన కారణం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కమిటీ తీర్మానంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తదనంతరం బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ముందుగా వివిధ సామాజిక వర్గం వారీగా కుల గణన చేపట్టి 56% బీసీ కులాలు,18% ఎస్సీ కులాలు,12% ఎస్టి కులాలు,15% అగ్రకులాలు ఉన్నాయని లెక్కించడం జరిగింది.

ఐతే భారత రాజ్యాంగంలో 50% పైబడి రిజర్వేషన్లు దాటకూడదని ఎక్కడ లేనప్పటికీ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో(1992) ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు మించకూడదని తీర్పునివ్వగా, నేడు స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్స్ మించకూడదని ఆధునిక అనాగరిక చర్యకు నిదర్శనం.ఎందుకంటే భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతుల సమ్మేళనం కాబట్టి జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి వారి జానభా ప్రకారం  సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇలా సమస్త రంగాల్లో సమాన వాట దక్కాలి అదే స్వేచ్ఛ సమానత్వ సోదరభావ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రభుత్వంతో కూడిన స్వాతంత్ర, గణతంత్ర రాజ్యానికి నిదర్శనం..!

కాబట్టి భారతీయ కుల, మత అసమానత సమాజంలో సామాజిక రుగ్మతలని రూపు మాపడానికి సమ సమాజ నిర్మాణంలో భాగంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పొందుపరచబడం వాటి ఉద్దేశం తప్ప, ఆర్థికంగా వెనుకబడ్డారని నెపంతో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధం, అయినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా అగ్రకులాలని ఆకర్షించడానికి 5% కూడా లేని అగ్రకుల పేదల కోసం ఆర్థిక అంశాల పేదరికన్ని జోడించి ఈ ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావడం అంటే ఒక రకంగా దేశంలో తరతరాలుగా ఏ ఆధారం లేక కడు పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయి.అగ్రకులాల నుండి ఎలాంటి సామాజిక రాజకీయ పోరాటలు జరిగనప్పటికీ కేంద్ర బిజెపి ప్రభుత్వం రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తదనంతరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి, ఒక విధంగా అణగారిన వర్గాల రిజర్వేషన్స్ పెంచకుండా అగ్రకులాల అభివృద్ధికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మరింత ఉపయోగకరంగా ఉండడం గమనర్షం. 

ఇకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసి లకి ఇస్తామని జీవో.9 ను తీసుకురవడం గమనార్హం.కానీ ఈ ఒక్క జీవో హైకోర్టులో టెక్నికల్ గా బలపడలేక కోర్టు ఈ ఒక్క అంశంపై స్టే ఇవ్వడం జరిగింది.ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా హైకోర్టు తీర్పును సమర్థించడం అంటే, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీ ల 42% రిజర్వేషన్ల పట్ల నిబద్ధతతో లేదని నిరూపించుకుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, అగ్ర నాయకత్వం ఐన రాహుల్ గాంధీ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే కేంద్ర ప్రభుత్వంపై సామాజిక, రాజకీయ పోరాటం చేసి పార్లమెంటు చట్టం ద్వారా 9 వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పెట్టించి శాశ్వత పరిష్కార మార్గం చూపే వజ్రకవచం లాంటి రక్షణ చట్టాన్ని తేవాల్సి ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వం బీసీ ల అభివృద్ధి పట్ల నిబద్దతో లేదని స్పష్టంగా నిరూపితం అవుతున్నది.

అదేవిధంగా రాష్ట్రంలో సామాజిక, రాజకీయ పోరాటం చేసే బీసీ సంఘాలు మరియు నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకి 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనే అంశంపై దృష్టి పెడుతున్నారు తప్ప, విద్యా, ఉద్యోగ అంశాల్లో కూడా సమాజంలో 56% ఉన్న బీసీ లకు కనీసం 42% ఐన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై పోరాటం చేయకపోవడం రాష్ట్రంలో బీసీ సమాజంలో సరైన అవగాహన, చైతన్యం లేదాని చెప్పడానికి నిదర్శనం. నాడు స్వాతంత్ర పోరాటంలో భాగంగా అంబేద్కర్ వెంట ఎస్సీ, ఎస్టీలు ఉండబట్టి రాజ్యాంగబద్ధ విద్యా, ఉద్యోగ,రాజకీయ అంశాల్లో ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు దక్కాయి.కానీ అంబేడ్కర్ వెంట నడవకుండా, అగ్రవర్ణ నాయకుల పెత్తనం ఉండే కాంగ్రెస్ లోని గాంధీ, నెహ్రూల మాయలో పడి నాడు బీసీ లు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు సాధించుకోలేకపోయారు. తర్వాత మండల కమిషన్ ఉద్యమంలో బీసీ లు అధికంగా పాల్గొని జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్స్ సాధించుకోలేకపోయారు.

గతంలో మండల కమిషన్ సిఫారసులని అమలు చేయాలని మాన్యశ్రీ కాన్షీరాం దాదాపు రెండు నెలల పాటు పార్లమెంట్ ముందు టెంట్ వేసుకొని ధర్నా చేయడం మూలంగా వి.పి.సింగ్ ప్రభుత్వం ఓబిసి లకి విద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టం చేయడం గమనించడం. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో ఉన్న బీసీ కులాలకు తగిన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వగలుగుతున్నాయి. కానీ ఒక తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఆ రాష్ట్రంలో ఉన్న సామాజిక, రాజకీయ చైతన్యం మూలంగా పార్టీలకతీతంగా నాటి ముఖ్యమంత్రి ఐన జయలలిత కేంద్ర ప్రభుత్వంతో పోరాడి బీసీ ల కోసం 69% రిజర్వేషన్స్ సాధించుకొని రక్షణ కవచం లాంటి 9వ షెడ్యూల్లో పెట్టించుకోవడం గమనార్హం.

తమిళనాడు రాష్ట్రం మాదిరిగా తెలంగాణలో కూడా 9 వ షెడ్యూల్లో బిసి రిజర్వేషన్స్ అంశాన్ని పెట్టించి బలమైన రక్షణ కవచం తీసుకురావాలని రిటైర్డ్ జడ్జి మరియు జాతీయ బిసి కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్. ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ & బీసీ ఇంటలెక్చువల్ పోరం అధ్యక్షులు టి. చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ బీసీ 42% రిజర్వేషన్స్ సాధన సమితి పేరుతో బలమైన సామాజిక, రాజకీయ పోరాటలు చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

 కానీ విచిత్రం ఏంటంటే రేపు(18.10.2025) బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్ కి రాష్ట్రంలోని బిజెపి,బిఆర్ఎస్, ప్రభుత్వాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది.కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ ఓట్లు, సీట్లు పెంచుకోవడానికి ఎన్ని రాజకీయ పోరాటాలు ఐన చేస్తారు. కానీ బీసీ ల విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్స్ సాధించడం కోసం పార్టీలకి అతీతంగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాకపోవడం అంటే అగ్రకుల పార్టీలలో ఉండే ఆధిపత్య పాలక వర్గాల మధ్య ఉండే సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక స్వార్థ స్వభావం ఏ విధంగా ఉంటదో బహిర్గతంగా నిరూపణ కబడుతున్నది.

కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకి, బిఆర్ఎస్ నాయకులకు, బిజెపి నాయకులకు బీసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై బలమైన సామాజిక రాజకీయ పోరాటాలు చేసి బీసీ లకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్స్ సాధించలేకపోతున్నారు. ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి 56% ఉన్న బీసీ సమాజం అగ్రకుల నాయకులకు అభిముఖంగా స్వశక్తిగా, స్వధర్మంతో స్వీయ రాజకీయ వేదికతో పోరాటం చేసి బీసీ సమాజమే తమ హక్కులను సాధించుకోవాలి తప్ప, అగ్రకుల పార్టీ నాయకుల పై ఆధారపడడం అంటే, బలమైన జన బలాన్ని కలిగి ఉండి, తమ శక్తిని తాము తెలుసుకోకపోవడం అంటే బీసీ లు స్వీయ పరీక్ష చేసుకోవాలి..?

మరి రేపు(18.10.2025) జరగబోయే రాష్ట్ర బంద్ కి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయంటే ఇక్కడ దోషి ఎవరు..? నిర్దోషి ఎవరు..? బీసీ లకి శత్రువు ఎవరు.. . మిత్రువు ఎవరు..? బీసీ సమాజం గ్రహించాలి.! కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పై రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురారు..? బీసీ లకు 42% రిజర్వేషన్స్ కల్పించడంలో భాగంగా అదే విధంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం పై పోరాడి ఎందుకు పార్లమెంట్ చట్టం ద్వారా, 42% రిజర్వేషన్లు బీసీ సమాజం కోసం సాధించలేకపోతున్నారు.అంటే మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ నాయకులకి బీసీ లకు 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలోనే కాదు విద్యా, ఉద్యోగ అంశాల్లో కూడా సాధించాలనే నిబద్ధత లేదని నిరూపణ అవుతున్నది.

కానీ రేపు జరగబోయే రాష్ట్ర బంద్ లో అన్ని పార్టీల నాయకులు పాల్గొంటూన్నారు అంటే ఎవరికి వ్యతిరేకంగా..? ఇక్కడ బీసీ రిజర్వేషన్ అంశాన్ని 9 వ షెడ్యూల్లో పెట్టవలసింది కేంద్ర ప్రభుత్వమే కదా..! మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని శత్రువుగా చూపించడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్, బిఆర్ఎస్ వివిధ కుల సంఘాలు విఫలమవుతున్నట్టుగా నిరూపణ అవుతున్నది. మరి రాష్ట్ర  బంద్ దేనికి వ్యతిరేకంగా పరిగణించాలి..? హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకి అభిముఖంగానా..? రాజ్యాంగబద్ధమైన కోర్టులు టెక్నికల్ అంశాలు బలంగా లేనప్పుడు రాజ్యాంగానికి లోబడే న్యాయబద్ధమైన తీర్పులు ఇస్తాయి కదా..! కోర్టు పరీక్షలకి నిలబడి బలమైన చట్టం తీసుకురావాల్సిన బాధ్యత వివిధ రాజకీయ పార్టీలపై, ప్రభుత్వాలపై ఉంటది కదా.! 

కాబట్టి ఇకనైనా బిసి సమాజం ఈ అగ్రకుల పాలక వర్గాలైన రెడ్డి,వెలమ,కమ్మ భూస్వామ్య రాజకీయ, పెట్టుబడిదారుల క్షుద్ర రాజకీయాలను గమనిస్తూ స్వీయ రాజకీయ పార్టీ వేదికగా స్వశక్తి,స్వధర్మ రాజకీయాలు చేస్తూ.. ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు వంటి బీసీ నాయకత్వం కలిగిన ప్రభుత్వలని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులాల ఆధ్వర్యంలో బలమైన నాయకత్వాన్ని నడిపిస్తూ, రాష్ట్రంలో అగ్రకులాలకి అభిముఖంగా బీసీ ల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యాన్ని, ఐక్యతని ప్రదర్శించి రాష్ట్రం, కేంద్రంలో బీసీ ల నాయకత్వాన ప్రభుత్వలని ఏర్పాటు చేసినప్పుడే ఒక్క బీసీ లవే కాదు, ఎస్సీ, ఎస్టీల అణగారిన వర్గాల తరతరాల సకల సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గం చూపబడుతాది అనే చారిత్రక సత్యాన్ని నేడు అణగారిన వర్గాల నాయకులు, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం.

  _ పుల్లెంల గణేష్ (ధర్మ సమాజ్ పార్టీ _ స్టడీ & రీసెర్చ్ టీం రాష్ట్ర ఇంచార్జ్)

  _ 9553041549

RELATED ARTICLES
- Advertisment -

Latest News