- రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు.
వరంగల్ డిసిసి అధ్యక్షుడు అయూబ్ ద్వారా, వరంగల్ జిల్లా కలెక్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించిన బీసీ హక్కుల సాధన సమితి. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, బీసీ రిజర్వేషన్ల సాధనకై అఖిలపక్ష సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి lఢిల్లీకి తీసుకు వెళ్లాలని, వరంగల్ డిసిసి అధ్యక్షుడు అయూబ్ ద్వారా, జిల్లా కలెక్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించిన బీసీ హక్కుల సాధన సమితి. బీసీ రిజర్వేషన్స్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు తక్షణమే అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకు వెళ్లాలని, బీసీ రిజర్వేషన్స్ పెంచిన తర్వాతనే జెడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు డిమాండ్ చేశారు.

బీసీ హక్కుల సాధన సమితి ప్రతినిధి వర్గం మంగళవారం వరంగల్ లో డిసిసి అధ్యక్షుడు ఎండి అయూబ్ ఖాన్ ను కలిసి వినతి పత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్స్ అమలయ్యేలా ప్రయత్నిస్తానని, బీసీ ఉద్యమాలకు తన వంతు సహకారం అందిస్తానని హామీఇచ్చారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ జి సంధ్యారాణి కి వినతి పత్రాన్ని అందించగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రాన్ని అందించిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడు వలబోజు వెంకన్న, ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, సహాయ కార్యదర్శి బొట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ శాసనసభ సమావేశాలలో చర్చించి ముఖ్యమంత్రి దీనిపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
