Friday, February 27, 2026
Homeవరంగల్‌BC JAC | బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే సమరమే

BC JAC | బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే సమరమే

  • బీసీ జేఏసీ చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీసీ జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా సర్పంచ్ ఎన్నికలకు పోతే సమరమే అని బిసి జెఏసి వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని మరి ఇప్పుడు మాట మార్చి ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర బీసీ జెఏసి పిలుపుమేరకు అష్టంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమం ఉదృతం అవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా 42 శాతం కేటాయించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిండం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. పార్టీ గుర్తులు కూడా లేని సర్పంచ్ ఎన్నికలలో పార్టీ పరంగా 42 శాతం కేటాయిస్తమని ప్రభుత్వం ప్రకటించడాన్నీ బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బీసీలను మోసం చేస్తున్నట్లుగా భావిస్తున్నామని అన్నారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ పోరాడకుండా వెనుకడుగు వేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపకుండా బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ ల రిజర్వేషన్ల అమలు కోసం సిఎం నేతృత్వంలో అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లాలని డిసెంబర్ ఒకటి నుండి జరిగే పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్రం పై పోరాడాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ఆమోదించాలన్నారు. బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(కాంగ్రెస్, బిజెపి) ల మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బిసి జెఏసి సూచన మేరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాలలో శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకో లతో పాటు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేలా ఉద్యమించాలని సమస్త బిసి సమాజానికి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ ఉద్యమ సమరానికి పిలుపునిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా కార్యదర్శి నీల సుధాకర్ ముదిరాజ్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, చెన్నారావుపేట మండల మహిళా అధ్యక్షురాలు బండి విజయ, చెన్నారావుపేట గ్రామ మహిళా అధ్యక్షురాలు ముంజ లక్ష్మీ, బీసీ నాయకులు శీరంశెట్టి రాజేందర్ పెరక, మద్దెల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News