కరీంనగర్, నవంబర్ 16(ఆదాబ్ హైదరాబాద్): బీసీ జేఏసీ (BC Jac) రాష్ట్ర ఛైర్మన్(Chairman), రాజ్యసభ సభ్యుడు (RajyaSabha Mp) ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) పిలుపు మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో న్యాయ సాధన దీక్షలు జరిగాయి. బీసీల 42 శాతం రిజర్వేషన్లను (Reservations) చట్టబద్ధంగా అమలుచేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీసీ జాక్ న్యాయ సాధన దీక్షను బీసీ జేఏసీ నేతలు చేపట్టారు.
ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఆది మల్లేశం, నాగుల కనకయ్య, నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలుచేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీ సంఘాల నాయకులను, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో మొత్తం కాంగ్రెస్ ఎంపీలు 42 శాతం రిజర్వేషన్ల అంశంపైన చర్చకు పట్టుబట్టాలని అన్నారు. బిల్లు ఆమోదం పొందేలా చూడాలని, రాజ్యాంగ సవరణ చేసి బీసీ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలుచేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని పేర్కొన్నారు. లేకుంటే.. బీసీ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జాక్ నేతలు జీఎస్ ఆనంద్, ఉమా మహేశ్వర్, గున్నాల కన్నాంబ, మహేష్, బాబన్న, అంజద్, నల్లగోని శ్రీనివాస్, నితిన్, మహేందర్ ముదిరాజ్, గట్టు సత్యం, బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
