Friday, March 20, 2026
Homeనల్లగొండMiryalaguda Mla | అసెంబ్లీలో బత్తుల లక్ష్మారెడ్డి

Miryalaguda Mla | అసెంబ్లీలో బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(Bathula Laxma Reddy) శనివారం అసెంబ్లీ మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల (Double Bedroom Houses)ను మరమ్మతులు చేయించి అర్హులైన పేద ప్రజలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని తాళ్లగడ్డ, గాంధీ నగర్, బాపూజీ నగర్, వినోబా నగర్, బంగారుగడ్డ, ప్రకాశ్ నగర్, షాబునగర్, రామ్ నగర్, ఏడుకోట్ల తండా, నందిపాడు, సుందర్ నగర్, ముత్తిరెడ్డి కుంట, కలల్ వాడ, సీతారాం పురం ఏరియాల్లో సొంత స్థలం, ఇళ్లు లేని పేద ప్రజలకు ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Indlu) కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బత్తుల లక్ష్మారెడ్డి అభ్యర్థనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సానుకూలంగా స్పందించారు. పట్టణంలోని 14 వార్డుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరుచేస్తామన్నారు. స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బాగు చేసి లబ్ధిదారులకు అతి త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News