అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని బాటసింగారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండు ఛాంపియన్షిప్స్ సాధించారు. ఆదివారం పైల్వాన్ క్లబ్ కూకట్ పల్లి వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో 12 సంవత్సరాలలోపు, 14 సంవత్సరాలలోపు బాలుర విభాగం కబడ్డీ పోటీలలో దాదాపుగా 12 టీమ్ లతో పోటీపడి అత్యంత అధిక పాయింట్లు తేడాతో ఘన విజయం సాధించారు. బి.కౌషిక్,ఎం.రాంచరణ్,జి.సుశాంత్ ,బి.తులసిరామ్, ఏ రంజిత్, వి హరీష్,బి కౌశిక్, బి కార్తీక్ సోను, వై.మణికంఠ, ఓ కార్తీక్, పి కౌశిక్.ఏ జాశ్వంత్, జి బాలాజీ, టీ శివ ,మొత్తమ్ 15 మంది బృందం సభ్యులు పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ అభినందన:
పాఠశాలలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ క్రీడాకారులను అభినందించారు. ఎర్రవెల్లి గౌరీ శంకర్,మరియు నార్లకొండ వెంకటేష్ లు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు భవిష్యత్తులో ఎల్లవేళలా అండ దండలుగా ఉంటానని పెద్దపెద్ద విజయాలు సాధించాలని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ విద్యార్థి దశలో అత్యంత ముఖ్యమైనదని, స్కూలు ఆవరణను విద్యార్థుల యొక్క ఇంటిగా భావించి ఆవరణలో చెట్లను నాటాలని పిలుపునిచ్చారు, చెడు అలవాట్లకు మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచన చేశారు. ఉపాధ్యాయులను గౌరవించాలని, ఉపాధ్యాయులు చెప్పే మంచి విషయాలను గ్రహించాలని చెప్పారు బాటసింగారం గ్రామానికి నూతనంగా ఎంపికైన సర్పంచ్ ఎర్రవల్లి గౌరీ శంకర్ ,ఉప సర్పంచ్ వెంకటేశ్ ని పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రదానోపాద్యాయుడు ప్రతాప్, ఉపాద్యాయణి ఉపాద్యాయులు, విద్యార్ధుల తల్లి దండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

