Saturday, February 28, 2026
HomeజాతీయంEncounter | బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్

Encounter | బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్

  • 12మంది మావోయిస్టులు హతం..
  • ముగ్గురు డీఆర్ జవాన్లూ వీరమరణం..
  • మరో ఇద్దరికీ గాయాలు..

ఛత్తీస్ గఢ్ బస్తర్ డివిజన్లో భద్రతా బలగాలు%-%మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్- దంతేవాడ అంతర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు డీఆర్టీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరొక ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై వచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టగా, ఆకస్మికంగా ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

సిబ్బంది మోను వాడారి, దుకారు గొండే, రమేష్ సోడి వీరమరణం పొందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఇద్దరు జవాన్లను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, 303 రైఫిళ్లు సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి అదనపు బలగాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్పై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేమని బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News