Monday, October 27, 2025
ePaper
Homeస్పోర్ట్స్సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో బాస్కెట్‌బాలే నంబర్ వన్

సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో బాస్కెట్‌బాలే నంబర్ వన్

జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థ నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో బాస్కెట్‌బాల్ క్రీడ అగ్రస్థానంలో నిలిచిందని ఖమ్మం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీ సునీల్ రెడ్డి అన్నారు. బాస్కెట్‌బాల్ వేసవి శిక్షణ శిబిరాల ముగింపు సంబరాల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసిప్లిన్‌లో మరియు సంఖ్యాపరంగా బాస్కెట్‌బాల్ క్రీడకారులు తమ ఉనికిని చాటుకున్నారని చెప్పారు.

క్రీడాకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఉదయం నాలుగు విడతలు సాయత్రం ఆరు విడతలుగా విభజించవలసి వచ్చిందని పేర్కొన్నారు. జిల్లా బాస్కెట్‌బాల్ బాధ్యులు బాస్కెట్‌బాల్ రమణ యాదవ్ మాట్లాడుతూ తల్లితండ్రులు ఒక్క వేసవి కాలంలో మాత్రమే కాక ప్రతి రోజూ శిక్షణకు పంపించాలని ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం జరిగిన క్యాంప్ ఫైర్‌లొ క్రీడాకారులు, తల్లితండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News