గంజాయి బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ నిజామాబాద్ జిల్లా(Nizamabad District) ఎక్సైజ్ కానిస్టేబుల్(Excise Constable) సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను బాన్సువాడ ఎమ్మెల్యే(Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి (Nims Hospital)కి వెళ్లారు. బాధితురాలు ప్రస్తుతం ఈ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతోంది. దీనిపై డాక్టర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే.. సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని బాధితురాలి కుటుంబానికి భరోసా కల్పించారు. సౌమ్య సంపూర్ణంగా కోలుకుంటుందని, తిరిగి త్వరగా విధుల్లో చేరాలని ఆశిస్తున్నానని తెలిపారు. పోచారం వెంట నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.
Mla Pocharam | ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శ
- Advertisement -
RELATED ARTICLES
