Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Karimnagar MP | బీజేపీ కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు

Karimnagar MP | బీజేపీ కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి(BJP President)గా ఎన్నికైన నితిన్ నబిన్‌(Nitin Nabin)కి కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి(Union Minister) బండి సంజయ్(Bandi Sanjay) హృదయపూర్వక అభినందనలు(Hearty Congratulations) తెలిపారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక కావటం క్షేత్రస్థాయిలో ఆయన పార్టీ శ్రేణుల్లో సంపాదించుకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. నితిన్ నబిన్ లాంటి చురుకైన నాయకులను ప్రోత్సహిస్తూ, పార్టీలోని ప్రతి కార్యకర్త సేవలను గుర్తిస్తూ అధిష్టానం బీజేపీ(BJP Highcommand)ని నిర్మించిన తీరుకు అద్దంపడుతోందని తెలిపారు.

క్రమశిక్షణ, ప్రజలతో కలిసిపోవటం, ఫలితాలు సాధించటంలో అంతర్లీనంగా ఇమిడిపోయిన నాయకత్వ శైలికి ఇది తిరుగులేని నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ(PM Modi) దార్శనిక మార్గదర్శకత్వంలో బీజేపీ.. భావజాలం, కార్యాచరణ రెండింటినీ అర్థంచేసుకునే నాయకులతో తననుతాను పునరుద్ధరించుకుంటూనే ఉందని అన్నారు. నితిన్ నబిన్ నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఉత్తేజాన్ని పొందుతుందని, ప్రజల సమస్యలపై మరింత లోతుగా దృష్టిపెడుతుందని, కార్యకర్తలతో గాఢమైన అనుబంధాన్ని పెనవేసుకుంటుందని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News