Wednesday, February 11, 2026
HomeజాతీయంExit Polls | ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Exit Polls | ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

బీహార్ అసెంబ్లీ (Bihar Assembly) ఎన్నికల(Elections)తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు(Bye Elections) జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) నిషేధం (Ban) విధించింది. ఈ మేరకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌(Press Note)లో వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 11న సాయంత్రం ఆరున్నర వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించటానికి గానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడానికి గానీ వీల్లేదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. జూబ్లీహిల్స్ (JubileeHills) ఉపఎన్నిక నేపథ్యలో ఇప్పటికే రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES

Latest News