ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ను క్యాతన్ పల్లిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో సుమన్ నివాసంలో మందమర్రి సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనను గృహనిర్బంధం చేయడం పట్ల బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ధర్మం ఎప్పుడు విజయం సాధిస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని, వారు రేవంత్ సర్కార్ కు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
- Advertisement -
