Monday, March 30, 2026
Homeఅంతర్జాతీయంCovid Alert | మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్..

Covid Alert | మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్..

  • సుమారు 23 దేశాల్లో కేసులు నమోదు..
  • హెచ్చరించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్..

కోవిడ్‌కు చెందిన బీఏ.3.2 వేరియంట్ (బీఏ.3.2 కోవిడ్ 19 వేరియంట్ ) ప్ర‌స్తుతం మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ది. ఆ వైర‌స్ వేరియంట్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాపిస్తున్న‌ది. సుమారు 23 దేశాల్లో ఆ వేరియంట్‌కు చెందిన కేసులు న‌మోదు అయిన‌ట్లు అమెరికాకు చెందిన సీడీసీ పేర్కొన్న‌ది. అమెరికాలోనూ భారీగా బీఏ.3.2 వేరియంట్ కేసులు న‌మోదు అవుతున్న‌ట్లు సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ పేర్కొన్న‌ది. బీఏ.3.2 వేరియంట్‌ను సికాడా వేరియంట్‌గా పిలుస్తున్నారు. అయితే చాప‌కింద నీరులా ఆ వైర‌స్ వేరియంట్ వ్యాపిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. భారీ సంఖ్య‌లో ఆ వేరియంట్ మ్యుటేష‌న్ల‌కు గుర‌వుతున్న‌ది.

సార్స్ సీవోవీ2కి చెందిన బీఏ.3.2 వేరియంట్‌ను 2024లో తొలుత ద‌క్షిణాఫ్రికాలో గుర్తించారు. జ‌న్యుప‌రంగా బీఏ.3.2 వేరియంట్‌ను భిన్నంగా అంచ‌నా వేస్తున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 75 మ్యుటేష‌న్లు ఉన్న‌ట్లు గుర్తించారు. మాన‌వ క‌ణాల‌ను చుట్టుకునే వైర‌స్‌లోని భాగ‌మే స్పైక్ ప్రోటీన్. జే ఎన్ .1 , ఎల్ పీ .8.1 వేరియంట్ల‌లో స్పైక్ ప్రోటీన్‌లో కేవ‌లం 40 మ్యుటేష‌న్లు మాత్ర‌మే జ‌రుగుతున్న‌ట్లు సీడీసీ వెల్ల‌డించింది. బీఏ.3.2 వేరియంట్ సోకిన వారిలో సాధార‌ణ కోవిడ్ ల‌క్ష‌ణాలే ఉండ‌నున్నాయి. గొంతు నొప్పి, ద‌గ్గు, తెమ‌డ‌, నీర‌సం, త‌ల‌నొప్పి, జ్వ‌రం లాంటి లక్ష‌ణాలు ఉంటాయి.కొంద‌రిలో ఉద‌ర సంబంధిత స‌మస్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయని సీడీసీ చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News