Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Cyber Crimes | సైబర్ నేరాల బారినపడకుండా అవగాహన

Cyber Crimes | సైబర్ నేరాల బారినపడకుండా అవగాహన

ట్రాఫిక్ నిబంధనలపైన కూడా విలాసాగర్ గ్రామస్తులకు పోలీసుల సూచనలు

కరీంనగర్, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా (Alert) ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) తప్పకుండా పాటించాలని పోలీసులు విలాసాగర్ గ్రామస్తులకు సూచించారు. గ్రామ భద్రత(Security)లో సీసీ కెమెరాల (CC Camera) ప్రాముఖ్యతను వివరించారు. సోమవారం బోయినపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో ఎస్ఐ పి.రామకాంత్, పీసీ రమేష్ పాల్గొన్నారు. గ్రామస్తుల సందేహాలను (Doubts) నివృత్తి (Clarify) చేశారు.

​సమావేశ ముఖ్యాంశాలు..

  • ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ షేరింగ్, నకిలీ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • తెలియని లింకులను క్లిక్ చేయొద్దు.
  • వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దు.
  • ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
  • నలుగురు ప్రయాణించకూడదు.
  • అతి వేగంతో వాహనాలు నడపకూడదు.
  • ఇవి నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తాయి.
  • అపార నష్టాలను కలగజేస్తాయి ​
  • నేరాలను నియంత్రించడానికి, దర్యాప్తుకు సీసీ కెమెరాలు సహాయపడతాయి
  • ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి
- Advertisement -
RELATED ARTICLES

Latest News