Tuesday, February 10, 2026
Homeవరంగల్‌Narsampet | నర్సంపేటకు దొంతి రాజకీయ వారసుడు అవియుక్త రెడ్డి

Narsampet | నర్సంపేటకు దొంతి రాజకీయ వారసుడు అవియుక్త రెడ్డి

  • ఫ్లెక్సీలతో డివిజన్ వ్యాప్తంగా చర్చ…
  • దాతృత్వంలో అవియుక్త రెడ్డి అనన్య రెడ్డి ముందంజ

నర్సంపేట నియోజక వర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారసుడు అవియుక్త రెడ్డి రాజకీయవారసుడిగా అరంగేట్రం చేశాడని పలువురు చర్చలకు తెర లేపారు. ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ రహదారి 365 పై ఊరూర భారీ స్థాయిలో ఫ్లెక్సీలు అవియుక్త రెడ్డి వీరాభిమాని పురుషోత్తం సురేష్ అలియాస్ డాన్ సూరి పేరుతో వెలవడంతో డివిజన్ వ్యాప్తంగా చర్చకు తెర లేపింది.

2023 సాధారణ ఎమ్మెల్యే ఎలక్షన్లలో అప్పటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ వద్ద నుండి తన తండ్రి దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే టికెట్ బి ఫామ్ ను సైతం అయుక్త రెడ్డి హైదరాబాద్ కి వెళ్లి తీసుకురావడంతో రాజకీయ రంగ ప్రవేశం అవియుక్త రెడ్డి చేసినట్లు నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడారు. అదేవిధంగా ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ మృతి చెందడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి తమ తమ వైరాలను విడిచి స్వయంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటికి వచ్చి పరామర్శించడంతో వారి మధ్య వైరం తొలగింది.

- Advertisement -

అంతేకాకుండా అవియుక్త రెడ్డిని దగ్గరకు తీసుకొని ఆయనతో ప్రత్యేకంగా సంభాషించి హైదరాబాద్ కు వచ్చి నన్ను ప్రత్యేకంగా కలవాలని స్వయంగా ముఖ్యమంత్రి అవియుక్త రెడ్డికి చెప్పడం అవియుక్త రెడ్డి హైదరాబాద్ కు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మాటామంతి చేయడం నర్సంపేటకు దొంతి మాధవరెడ్డి వారసుడు రాజకీయ వారసుడై వస్తున్నాడని పలువురు స్పష్టం చేస్తున్నారు. వాటికి తోడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఊరుర వెలసిన ఫ్లెక్సీలతో వారసత్వ రాజకీయాలకు దొంతి అవియుక్త రెడ్డి అరంగేట్రం చేసినట్టు స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

దాతృత్వంలో మేటి

నర్సంపేట ఎమ్మెల్యే తనయుడు దొంతి అవియుక్త రెడ్డి రాజకీయ అరంగేట్రంతో పాటు తన దాతృత్వాన్ని సైతం నిరూపించుకుంటున్నాడు. ఇటీవల తన చెల్లెలు అనన్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం లో జన్మదిన వేడుకలు జరుపుతూ మానసిక వికలాంగులకు అవసరమగు ఫ్రిడ్జ్తోపాటు ఫ్యాన్లు లైటింగ్ బెడ్స్ ప్రతినెల 20 క్వింటాళ్ల బియ్యం ఇచ్చే విధంగా రూపకల్పన చేసి అనాధల యెడల వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. తండ్రి ముఖంపై ఎప్పుడూ కనిపించే చిరునవ్వుతో పాటు ఆ దరహాసం ను పునికి పుచ్చుకున్న అవియుక్త రెడ్డి రాజకీయాల్లో రాణిస్తాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News