Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్Avakai | ఆవకాయ ఉత్సవం

Avakai | ఆవకాయ ఉత్సవం

తెలుగు సినిమా(Telugu Cinema), సాహిత్యం(Literature), కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి(AP Minister) కందుల దుర్గేష్(Kandula Durgesh) వెల్లడించారు. ఏపీ పర్యాటక శాఖ(Ap Tourism Department), టీమ్‌వర్క్ ఆర్ట్స్(Team Work Arts) సంయుక్తాధ్వర్యంలో జనవరి 8, 9, 10 తేదీల్లో విజయవాడ‌(Vijayawada)లోని పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్‌లో ఈ ఉత్సవాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సినిమా, సాహిత్యం, సంగీతం, నాటక రంగం, సాంస్కృతిక చర్చలను ఈ వేడుక ద్వారా ఒకే బహిరంగ వేదికపైకి తేనున్నామని చెప్పారు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతోపాటు సమకాలీన సృజనాత్మక పద్ధతులకు పెద్దపీట వేస్తూ వేడుక నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కందుల దుర్గేష్ ఇంకా ఏమన్నారంటే..

  • ఏపీని సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్, లిటరేచర్‌ను నిర్వహిస్తున్నాం.
  • రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది.
  • కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకత.
  • తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని అమరావతి-విజయవాడ ప్రాంతాన్ని సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యం.
  • ఈ ఉత్సవం ఏపీ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా స్థానిక కళాకారులకు, కళాభిమానులకు గొప్ప వేదికగా నిలుస్తుంది.
  • పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆవకాయ్ మంచి వేదిక.
  • ఏపీలో పర్యాటక రంగాన్ని, ప్రజా సంబంధాలను మెరుగుపరచడంలో సంస్కృతిని ఒక బలమైన పిల్లర్‌గా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు ‘ఆవకాయ’ ప్రతిరూపం.
  • 3 రోజులు సాగే ఈ వేడుకలో తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయి.
- Advertisement -
RELATED ARTICLES

Latest News