ఇండియాతో పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 29 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. వన్డేల్లో వరుసగా 16వ సారి టాస్ ఓడిపోయిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం వల్ల 50 ఓవర్ల మ్యాచ్‌ను కాస్తా 26 ఓవర్లకు కుదించారు. టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 131 రన్నులుగా నిర్దేశించారు. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యత సాధించింది.
- Advertisment -
