Monday, March 30, 2026
Homeస్పోర్ట్స్Aryna Sabalenka | మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న సభలెంక..

Aryna Sabalenka | మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న సభలెంక..

  • నాలుగో సీడ్ కోకో గల్ఫ్ చిత్తు చేసిన వైనం..

టాప్‌ సీడ్‌ అరీనా సబలెంకా ఖాతాలో మరో ఘనత. ఇటీవలే ఇండియన్‌ వెల్స్‌ గెలిచిన ఈ బెలారస్‌ బామ.. తాజాగా ఆదివారం ముగిసిన మియామి ఓపెన్‌లోనూ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుని ‘సన్‌షైన్‌ డబుల్‌’ సాధించింది. ఫైనల్‌లో సబలెంకా.. 6-2, 4-6, 6-3తో నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ ను చిత్తుచేసింది. టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్స్‌ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీల (ఇండియానా వెల్స్‌, మియామి ఓపెన్‌)ను ఒకే సీజన్‌లో గెలిచిన ప్లేయర్లకు సన్‌షైన్‌ డబుల్‌ గెలిచిన ఆటగాళ్లుగా గుర్తింపు దక్కుతుంది. 2022లో పోలండ్‌ అమ్మాయి ఇగా స్వియాటెక్‌ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌ క్రీడాకారిణీగా రికార్డులకెక్కింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News