నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) సోమవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ని ఆయన ఆఫీసులో కలిశారు. 15 నెలలుగా పెండింగ్లో ఉన్న మాధవ్ నగర్ ఆర్ఓబీ 193 సవరించిన అదనపు రూ.8.68 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్.. మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -
