Saturday, April 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Urdu Academy | ఉర్దూ అకాడమీకి 50 ఏళ్లు

Urdu Academy | ఉర్దూ అకాడమీకి 50 ఏళ్లు

ఈ నెల 16 నుంచి 20 వరకు వారోత్సవాలు

ఉర్దూ అకాడమీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో వారోత్సవాలు (Week Festivals) నిర్వహించనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ (Minority Affairs Minister Farooq) తెలిపారు. దేశ చరిత్రలోనే ఉర్దూ భాషాభివృద్ధికి పాటుపడిన ఏకైక నేత సీఎం చంద్రబాబు (CM Chandrababu) అని చెప్పారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని షా జాహుర్ ముసఫిర్ ఖనలో ఉర్దూ అకాడమీ ఉద్యోగుల సమీక్షా సమావేశం(Review Meeting)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. భాషకు మతంతో సంబంధంలేదని తెలిపారు. అకాడమీ ఉద్యోగుల్లో పనిచేసినవారికి గుర్తింపు, పనిచెయ్యనివారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

చైర్మన్ ఫరూక్ శుబ్లీ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులంతా నా కుటుంబ సభ్యులు’ అని చెప్పారు. ‘మీ కష్టాలను మా కష్టాలు అనుకుంటా. అందువల్ల శక్తివంచన లేకుండా పని చెయ్యండి’ అని కోరారు. సీఎం చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తామని, అధిక ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతానికి ఇస్తామని తెలిపారు. 159 మంది ఉద్యోగుల్లో 14 మంది సమావేశానికి గైర్హాజరు కాగా వారికి తక్షణం మెమోలు జారీ చెయ్యాలని అకాడమీ సెక్రటరీని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్మెంట్, యూత్ ఎంపవర్‌మెంట్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా పని చేస్తామని అన్నారు. వారోత్సవాలను సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ పేరుతో ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ‘మీరు ఉర్దూ అకాడమీ ఉద్యోగులు కాదు. కల్చరల్ అంబాసిడర్లు. అంటే సాంస్కృతిక రాయబారులు’ అని చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ స్పష్టం చేశారు. ఉర్దూ భాష, సంస్కృతి మన దేశ వారసత్వమని చెప్పారు. రానున్న 90 రోజుల్లో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అకాడమీ లైబ్రరీ సెంటర్లను, కంప్యూటర్ సెంటర్లను స్వయంగా చైర్మన్ సందర్శిస్తారని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో మైనార్టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిహెచ్ శ్రీధర్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గౌస్ పీర్, APSMFC ఎండీ యాకూబ్ భాషా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉర్దూ అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News