“ఇండియా మారిటైమ్ వీక్(IMW)–2025” కార్యక్రమంలో ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (BC Janardhan Reddy) పాల్గొన్నారు. ముంబైలోని NESCO ఎగ్జిబిషన్ సెంటర్‌లో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జల మార్గాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెషన్”(AP STATE SESSION)ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

- “SAILING THROUGH ANDHRA THE FUTURE OF MARITIME INVESTMENTS” అనేది ఈ సెషన్ థీమ్
- ఈ రాష్ట్ర సెషన్ (AP STATE SESSION)లో భాగంగా మారిటైమ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రాజెక్టులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విధానపరమైన పాలసీలు, పోర్టులు, షిప్పింగ్, లాజిస్టిక్స్, పర్యాటకం & అనుబంధ రంగాలలో వ్యూహాత్మక పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వివరించారు.
- జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా మారిటైమ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని తెలిపే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు & అభివృద్ధి మైలురాళ్లను ప్రదర్శించేందుకు వీలుగా “ఏపీ స్టేట్ పెవిలియన్” కూడా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత
- 100కు పైగా దేశాల భాగస్వామ్యం, 500కు పైగా ఎగ్జిబిటర్లు & రూ. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి అవకాశాలతో అతిపెద్ద ప్రపంచ మారిటైమ్ సమావేశాల్లో ఒకటిగా ఇండియా మారిటైమ్ వీక్ 2025 నిలవనుంది.
- ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విజన్ లో భాగంగా వికసిత్ భారత్ & ఆత్మనిర్భర్ భారత్ పిలుపు మేరకు, సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆలోచనల మేరకు IMW 2025లో తన మారిటైం నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ కు ఈ వేదిక ఒక గొప్ప అవకాశం
- ఈ కార్యక్రమంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఎం. టీ కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, ఏపీ ఎయిర్ పోర్టు అధారిటీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణాదిత్య, మారిటైమ్ బోర్డు సీఈవో అభిషేక్ కుమార్, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అధారిటీ ఛైర్మన్ జడ్. శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

