Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్AP Liquor case | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

AP Liquor case | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ కేసులో(AP Liquor case) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డికి ఊరట లభించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో ఏ4 ఉన్న మిథున్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. అయితే మిథున్ రెడ్డి వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని సూచించింది. అంతే కాకుండా రెండు లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరి ష్యురీటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

లిక్కర్ కేసు(AP Liquor case)లో ఆరోపణలు ఎదురుకుంటున్న మిథున్ రెడ్డిని జూలై 20న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి (ఏ31), కృష్ణమోహన్ రెడ్డి (ఏ32), బాలాజీ గోవిందప్ప (ఏ33)లకు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు :

ఆర్బీఐ కి కొత్త డిప్యూటీ గవర్నర్

RELATED ARTICLES
- Advertisment -

Latest News