Monday, March 2, 2026
Homeఆంధ్రప్రదేశ్Evacuation | తెలుగువారిని జాగ్రత్తగా తీసుకుని వస్తాం..

Evacuation | తెలుగువారిని జాగ్రత్తగా తీసుకుని వస్తాం..

  • హామీ ఇచ్చిన ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని వివరించారు. హెల్ఫ్‌లైన్‌ నంబర్లను వినియోగించుకోవాలని కోరారు. ఏపీ ఎన్నార్టీఎస్‌ 24/7 హెల్ఫ్‌లైన్‌0863-2340678కు సమస్యను తెలియచేయవచ్చని పేర్కొన్నారు. తూర్పు గోదావరికి జిల్లఆకు చెందిన రెండు లక్షల మంది అరబ్‌దేశాల్లో ఉన్నారని వివరించారు.

- Advertisement -

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతున్నది. యూఏఈ, కువైట్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, ఇరాక్‌ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ క్షిపణుల దాడి చేస్తున్నది.

ఈ క్రమంలో దుబాయ్‌లోని ఎయిర్‌పోర్టుల్ని మూసివేశారు. ఫలితంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తన బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడే చిక్కుకుపోయారు .

- Advertisement -
RELATED ARTICLES

Latest News