Tuesday, February 10, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandra Babu | ‘సంవిధాన్ దివస్’లో పాల్గొన్న సీఎం

Chandra Babu | ‘సంవిధాన్ దివస్’లో పాల్గొన్న సీఎం

సంవిధాన్ దివస్(Samvidhan Diwas)(రాజ్యాంగ దినోత్సవం-Constitution Day)లో ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్(Speaker), మంత్రులు (Ministers), అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ(Mock Assembly)ని తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరును అభినందించారు. 175 నియోజకవర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

  • స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారు. చాలా బాగా రాణించారు.
  • అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.
  • విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏవిధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్‌ఫుల్‌గా వ్యవహరించారు.
  • ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం.
  • మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం.
  • నేను 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాను.
  • యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను.
  • మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్‌గా చేరాలని అడిగితే.. ‘లెక్చరర్‌గా రాను. ఎమ్మెల్యే అవుతాను’ అని చెప్పాను.
  • 1978లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కనబడతానని చెప్పి గెలిచి చూపించాను
  • ఐఏఎస్ అవ్వాలంటే ఎంతో ప్రిపేర్ అవ్వాలి.
  • అదే నేను రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయొచ్చని ఆలోచించాను.
  • నిరంతరం శ్రమించాలి.
  • ప్రతి ఒక్కరికీ సంక్షోభాలు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సరైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలి.
  • అందువల్లే నేను 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాను.
  • 30 ఏళ్లకే మంత్రి అయ్యాను.
  • 40 ఏళ్లకు సీఎం అయ్యాను.
  • స్పీకర్ అయ్యన్నపాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు.
  • నా కంటే చిన్న వయసులోనే మీరు మాక్ అసెంబ్లీకి వచ్చి సమర్థవంతంగా నిర్వహించారు.
  • మా ఎమ్మెల్యేలు తడబడ్డా మీరు మాత్రం తడబడలేదు. మీ కాన్ఫిడెన్స్‌కు అభినందనలు.
  • అసెంబ్లీని మరిపించేలా సెటప్ వేసి మీ అందిరినీ ఎమ్మెల్యేలుగా చూస్తున్నాం.
  • బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించుకున్నాం.
  • రాజ్యాంగాన్ని అంబేద్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.
  • అంబేద్కర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు.
  • దేశానికి ఆత్మగా భారత రాజ్యాంగం నిలిచింది.
  • 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది.
  • 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు సుధీర్ఘంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొంచింది ఆమోదించుకున్నాం.
  • అనేక ఒడిదుడుకులు వచ్చాయి.
  • ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొన్నాం.
  • అయినా.. రాజ్యాంగం మనుగడ సాధించడం వెనక కారణం.. రాసిన విధానం.
  • రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉంది.
  • రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలుచేసేవారు మంచి వారు కాకపోతే చెడు ఫలితాలను ఇస్తుంది.
  • రాజ్యాంగం అమలుచేసేవారు మంచి వారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని అంబేద్కర్ (Ambedkar) స్పష్టంగా చెప్పారు.
  • నేను మీ అందరికీ ఆయుధాన్ని ఇస్తున్నాను.. అది ఓటు అని చెప్పారు.
  • భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఓటు అవకాశం కల్పించిన రాజ్యాంగం భారత రాజ్యాంగం
  • 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మన దేశంలో ఓటు హక్కు ఉంటుంది.
  • కొన్ని దేశాల్లో బలహీనవర్గాలకు ఓటు అవకాశం లేదు. పోరాడి తెచ్చుకున్నారు.
  • మరికొన్ని దేశాల్లో మహిళలు ఓటు కోసం పోరాడారు.
  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్‌లో మొన్నే బిల్లు కూడా పాస్ అయింది
  • అమెరికాలో ఒక మహిళ ఆ దేశ అధ్యక్షురాలు కాలేకపోయింది. కానీ భారతదేశంలో మహిళ ప్రధాని అయ్యారు.
  • ఓటు హక్కు మనకు వజ్రాయుధం.
  • మన భవిష్యత్‌కు మనం రూపకల్పన చేసుకోవచ్చు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News