Thursday, March 26, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu | ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం

CM Chandrababu | ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం

గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో(Prapancha Telugu Mahasabhalu) సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొన్నారు. మాతృ భాష (Mother Tongue)ను మర్చిపోవద్దని సూచించారు. ఇంగ్లిష్(English) అవసరమే అయినప్పటికీ తల్లి భాషను విస్మరిస్తే మనల్ని మనం కోల్పోయినట్లేనని తెలిపారు. మన దేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు అని, ప్రపంచం మొత్తమ్మీద దాదాపు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రపంచ తెలుగు మహా సభలకు సుమారు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ (Technology) బాగా డెవలప్ అయిందని, ఆ సాంకేతికతతో తెలుగు భాష(Telugu Language)ను సులువుగా కాపాడుకోవచ్చని సూచించారు. తెలుగు భాషావృద్ధి కోసం ఎన్టీఆర్(NTR) 1985లోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారని చెప్పారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News