Thursday, February 12, 2026
Homeఆంధ్రప్రదేశ్AP CM | ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ

AP CM | ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ

ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులను(Central Ministers) కలుస్తూ బిజీబిజీగా ఉన్నారు. జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌(CR Patil), ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌(Nirmala Sitharaman)లతో భేటీ అయ్యారు. ముందుగా పాటిల్‌తో సమావేశమైన చంద్రబాబు.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు(Permissions), పథకాలకు నిధుల (Funds) విడుదలపై చర్చించారు. ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు.

అనంతరం.. నిర్మలాసీతారామన్‌ను కలిసిన చంద్రబాబు.. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌‌కు చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని అడిగారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News