Saturday, October 4, 2025
ePaper
Homeస్పోర్ట్స్జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్న ఆమె.. 100 మీట‌ర్ల హ‌ర్డిల్స్‌లో త‌న‌కుతానే సాటి అని నిరూపించింది. తైవాన్ ఓపెన్‌‌లోనూ ప‌సిడిని సొంతం చేసుకుంది. ఇవాళ (జూన్ 7 శ‌నివారం) జ‌రిగిన 100 మీట‌ర్ల హ‌ర్డిల్స్‌ ఫైన‌ల్లో 12.99 సెక‌న్ల‌లోనే టార్గెట్‌ను చేరుకుంది. సౌత్ కొరియాలో మే 29న నిర్వహించిన ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో 12.96 సెక‌న్లలోనే ఫినిషింగ్ లైన్ చేరుకొని స్వర్ణంతో మెరిసిన జ్యోతి ఎర్రాజీ.. అదే ఎనర్జీతో తైవాన్ ఓపెన్‌లోనూ తన ప్రతిభను ప్రదర్శించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News